Magazines

అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్‌కు సైనికుడి హెచ్చరిక

1 గంట క్రితం

Soldier’s warning to US Defense Secretary Hegseth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌కు ఆర్లింగ్టన్ జాతీయ స్మశాన వాటికలో ఊహించని అనుభవం ఎదురైంది. అజ్ఞాత సైనికుడి సమాధి వద్ద నవ్వుతూ, మాట్లాడుకుంటూ ఫొటోలకు పోజులిస్తుండటంతో అక్కడ విధుల్లో ఉన్న కాపలా సైనికుడు ఆయనతో పాటు బృందాన్ని హెచ్చరించారు. ఈ ఘటన వెటరన్స్ డే వేడుకల అనంతరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హెగ్సెత్ తన భార్య జెన్నిఫర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రికీ బురియాతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి అజ్ఞాత సైనికుడి సమాధి వద్దకు వెళ్లారు. అక్కడ వారు ఫొటోలు దిగుతున్న సమయంలో నవ్వుతూ, మాట్లాడుకోవడంతో విధుల్లో ఉన్న సైనికుడు జోక్యం చేసుకున్నారు.


సందర్శకులందరూ అన్ని వేళలా నిశ్శబ్దం, గౌరవం పాటించాలని గట్టిగా హెచ్చరించారు. దీంతో హెగ్సెత్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయి గుర్తింపు తెలియని సైనికుల త్యాగాలకు గుర్తుగా ఈ సమాధిని నిర్మించారు. 'ది ఓల్డ్ గార్డ్'గా పేరొందిన 3వ యూఎస్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ సైనికులు ఇక్కడ నిరంతరం కాపలా కాస్తుంటారు. ఈ ఘటనపై పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందిస్తూ.. పవిత్రమైన ప్రదేశంలో గౌరవప్రదమైన వాతావరణాన్ని కాపాడాలని సైనికుడు సరిగ్గానే గుర్తుచేశారని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల సేవలను రక్షణ శాఖ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్