నవతెలంగాణ-కుభీర్
విద్యుత్ షాక్‌తో ఎద్దు మృత్యువాత పడ్డ ఘటన మండల పరిధిలోని రంగశివిని గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చింతవర్ సాయినాథ్‌కు చెందిన ఎద్దు బుధువారం సాయంత్రం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. రోజు మాదిరిగానే సాయినాథ్ బుధవారం ఉదయం తన వ్యవసాయ క్షేత్రానికి ఎద్దును తీసుకువెళ్లి మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ కు తగిలి అక్కడిక్కడే మృత్యువాత చెందింది. దీంతో కన్నీరుమున్నీరైన సాయినాథ్ ఎద్దు విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని వాపోయాడు. తనను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.






కామెంట్‌లు (0)