నవతెలంగాణ - తొగుట
ఆరుగలం కస్టపడి పండించిన ధాన్యం రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని పీఏసీఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాంపూర్, లింగంపేట, కాన్గల్, గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాని చెప్పారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పిట్ల సత్త య్య, సర్పంచ్ లు లచ్చోళ్ల రవీందర్, గొడుగు జయమ్మ నర్సింలు, మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు, ఉపాధ్యక్షులు మజ్జిగ వెంకట్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఆన్సర్, గ్రామ పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కృష్ణ, నాయకులు వెంకటేశం, కొండల్ రెడ్డి, బషీర్, పీఏసీఎస్ సీఈఓ గంగారెడ్డి, సిబ్బంది శేఖర్, రైతు లు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)