Magazines

మరోసారి మెరిసిన తిలక్‌ ‌వర్మ

03 సెప్టెంబర్, 2026

tilak-varma-
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 2 నిమిషాల చదవడం

బెంగళూరు: దులీప్‌ ‌ట్రోపీ ఫైనల్‌‌కు సౌత్‌‌జోన్‌ ‌జట్టు దూసుకెళ్లింది. నార్త్‌‌జోన్‌ ‌నిర్దేశించిన 182పరుగుల లక్ష్యాన్ని సౌత్‌ ‌జోన్‌ ‌జట్టు 43.1ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌‌లో సెంచరీతో మెరిసిన కెప్టెన్‌ ‌తిలక్‌ ‌వర్మ రెండో ఇన్నింగ్స్‌‌లోనూ అర్ధసెంచరీతో రాణించి సౌత్‌‌జోన్‌ ‌జట్టు ఫైనల్‌‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఓవర్‌‌నైట్‌ ‌స్కోర్‌ 7‌వికెట్ల నష్టానికి 256 పరుగులతో బుధవారం రెండో ఇన్నింగ్స్‌ ‌కొనసాగించిన నార్త్‌‌జోన్‌ ‌జట్టు 297పరుగులకు ఆలౌటైంది. కంబోజ్‌(36)‌కి తోడు నిషాంత్‌ ‌సింధు(35నాటౌట్‌) ‌బ్యాటింగ్‌‌లో రాణించగా.. సౌత్‌‌జోన్‌ ‌బౌలర్లు నిధేశ్‌(5/56)కి తోడు సాయితేజ, గోపాల్‌‌కు రెండేసి వికెట్లు దక్కాయి. దీంతో సౌత్‌‌జోన్‌ ‌ముందు ఆ జట్టుకు 182పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. అనంతరం సౌత్‌‌జోన్‌ ఓపెనర్లు రికీ బుయ్‌(42), జగదీశన్‌(43) ‌తొలి వికెట్‌‌కు 64పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. రషీద్‌(1) ‌నిరాశపరిచినా.. కెప్టెన్‌ ‌తిలక్‌ ‌వర్మ(51నాటౌట్‌), రవిచంద్రన్‌(32) మరో వికెట్‌ ‌పడకుండా మ్యాచ్‌‌ను ముగించారు. నార్త్‌‌జోన్‌ ‌బౌలర్లు ఆబిద్‌ ‌ముస్తాక్‌‌కు రెండు, గుర్నూర్‌ ‌బ్రార్‌‌కు ఒక వికెట్‌ ‌దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌ ‌తిలక్‌ ‌వర్మకు లభించింది. చిదంబరం స్టేడియంలో 6 నుంచి జరిగే ఫైనల్లో సౌత్‌‌జోన్‌ ‌జట్టు ఈస్ట్‌‌జోన్‌‌తో టైటిల్‌‌కోసం తలపడనుంది.
స్కోర్‌‌బోర్డు...
నార్త్‌‌జోన్‌ ‌తొలి ఇన్నింగ్స్‌ : 195 పరుగులు సౌత్‌‌జోన్‌ ‌తొలి ఇన్నింగ్స్‌ : 312 పరుగులు నార్త్‌‌ జోన్‌ ‌రెండో ఇన్నింగ్స్‌ : 297పరుగులు సౌత్‌‌జోన్‌ ‌రెండో ఇన్నింగ్స్‌: రికీ బుయ్‌ (‌సి)కంబోజ్‌ (బి)గుర్నూర్‌ ‌బ్రార్‌ 42, జగదీశన్‌ (‌స్టంప్‌)అబ్దుల్‌ ‌సమద్‌ (‌బి)అబిద్‌ ‌ముస్తాక్‌ 43, షేక్‌ ‌రషీద్‌ (‌బి)అబిద్‌ ‌ముస్తాక్‌ 1, తిలక్‌ ‌వర్మ (నాటౌట్‌) 51, రవిచంద్రన్‌ (‌నాటౌట్‌) 32, అదనం 13. (43.1ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 182పరుగులు. వికెట్ల పతనం: 1/64, 2/65, 3/103 బౌలింగ్‌: ఆర్ష్‌‌దీప్‌ 7-1-34-0, కంబోజ్‌ 5-1-22-0, గుర్నూర్‌ ‌బ్రార్‌ 7-1-22-1, అబిద్‌ ‌ముస్తాక్‌ 16-2-55-2, ఆయుష్‌ ‌బడోనీ 2-0-11-0, నిషాంత్‌ ‌సింధు 4-0-15-0, ఆయుష్‌ ‌డోసేజా 2-1-7-0, ఖమ్రాన్‌ ఇక్బాల్‌ 01.-0-4-0.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్