Magazines

విషాదం..రిజర్వాయర్‌లో పడి ఐదుగురు బాలికలు మృతి

16 అక్టోబర్, 2026

water
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్ లో పడి ఐదుగురు బాలికలు మృతి చెందారు. డ్యాంలో స్నానానికి దిగడంతో ఒక్కసారిగా నీటిలో గల్లంతయ్యారు. ఈత రాక, నీటిలో ఊపిరాడక బాలికలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసుల, రెస్కూ సిబ్బంది బాలికల మృతదేహాలను బయటకు తీశారు. పెనుకొండ దర్గాపేటకు చెందిన ముస్లిం కుటుంబాల బాలికలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్