నవతెలంగాణ - హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మోయినాబాద్‌లో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. విద్యార్థులు మద్యం సేవిస్తున్న సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని చూసి పరుగులు తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ రైతు పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతులను అత్తాపూర్‌కు చెందిన మోక్షసాయి చరణ్, బల్కంపేటకు చెందిన యశ్వంత్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






కామెంట్‌లు (0)