నవతెలంగాణ - హైదరాబాద్ : మంచాల మండల విలేకరి గుండెపోటుతో శుక్రవారం అర్ధరాత్రి మరణించడం బాధాకరం అని నవతెలంగాణ సీపీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్ అన్నారు. జగన్ మంచాల మండలంలో అనేక ప్రజాసమస్యలు వెలికి తీసి అనేక వార్తలు, కథనాలు రాశారు. నిబద్ధతతో పనిచేశారని జగన్ సేవలను వారు గుర్తుచేసుకున్నారు. జగన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎడీవీటీ జనరల్ మేనేజర్ ఎ.వెంకటేష్, రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహీందర్ రెడ్డి, డెస్క్ ఇన్ చార్జి అజయ్, స్టాఫర్ సైదులు, డెస్క్ సబ్ ఎడిటర్లు, సహచర జర్నలిస్టు జగన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.






కామెంట్‌లు (0)