Magazines

బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీ

1 గంట క్రితం

Brahmaputra river
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అస్సాంలోని బార్పేట జిల్లాలో బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీ కొన్నాయి. బహారీ ఘాట్ వద్ద 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రెండు ప్రయాణీకుల పడవలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.


ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒక ప్రయాణీకుల పడవ బ్రహ్మపుత్ర నది దక్షిణపు ఒడ్డు నుండి బహారీ ఘాట్‌కు వస్తుండగా, మరో పడవ ఘాట్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకుంటూ నిలిచి ఉంది. ఘాట్‌ను సమీపిస్తున్నప్పుడు వస్తున్న పడవ అదుపు తప్పి నిలిచి ఉన్న పడవను ఢీకొట్టడంతో, ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడటంతో వారిని వైద్య చికిత్స కోసం చెంగా మోడల్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్