నవతెలంగాణ – ఉప్పునుంతల
విధుల పట్ల నిర్లక్ష్యం, ఒకరి భూమిని మరొకరి పేర్లపై నమోదు చేసిన కారణంగా ఉప్పునుంతల తహశీల్దార్ సునీతపై నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామం సర్వే నంబర్ 115లో ఖాస్రా రికార్డుల ప్రకారం.. 1971-72 నుంచి 1976-77 వరకు ఉన్న పాత పహాణీలు, ఐబీ రిజిస్టర్‌లో 18.17 గుంటల భూమి ద్యాప రామిరెడ్డి పేరుపై ఉన్నట్టు అధికారులు విచారణలో భాగంగా గుర్తించారు.
అయితే నూతన ఆర్‌ఓఆర్ రికార్డుల ప్రకారం 13 ఎకరాల 17 గుంటలు సర్వే నంబర్ 115/Aలో ద్యాప రామిరెడ్డి పేరుపై, మిగిలిన ఐదు ఎకరాలు 115/AAలో పి. యాదమ్మ పేరుపై నమోదైనట్లు విచారణలో తేలింది. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉప్పునుంతల తహశీల్దార్ సునీతను తెలంగాణ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్, 1991లోని రూల్ 8(1)(a) ప్రకారం సస్పెండ్ చేస్తున్నట్టు శనివారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.





కామెంట్‌లు (0)