Magazines

'ఇందిరమ్మ జీవిత బీమా' నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

16 నిమిషాల క్రితం

Life Insurance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

- జిల్లా పంచాయతీ అధికారి వినోద్

- గ్రామాల్లో పథకం ఆన్‌లైన్ నమోదు అమలు తీరు పరిశీలన 

నవతెలంగాణ-సత్తుపల్లి 

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) వినోద్ ఎంపీడీవో రావెళ్ల చిన్న నాగేశ్వరరావు, మండల పంచాయతీ అధికారి జోత్స్నాదేవిని ఆదేశించారు. సోమవారం సత్తుపల్లి వచ్చిన డీపీఓ వినోద్ మండలంలోని కిష్టారం, కొత్తూరు, రేజర్ల గ్రామ పంచాయతీలలో జరుగుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


మండలంలోని 21 గ్రామ పంచాయితీల పరిధిలో మొత్తం 15,608 మంది రేషన్ కార్డు లబ్ధిదారులందరికి ఈ బీమా సౌకర్యం అందేలా చూడాలని ఆయన కోరారు. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీఓ జ్యోత్స్నాదేవి, కిష్టారం సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి అప్పారావు, కొత్తూరు సర్పంచ్ అయినంపూడి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గొర్లమారి రామ్మోహనరెడ్డితో పాటు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్