Magazines

పన్నుల వసూళ్లలో లక్ష్యాలను సాధించాలి

17 నిమిషాల క్రితం

Tax collection
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

పరకాల మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశం

నవతెలంగాణ - పరకాల 

పరకాల మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లతోపాటు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరకాల మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్‌తోపాటు వివిధ విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్ల పురోగతి, సిబ్బంది హాజరు, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు, ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల ప్రాసెసింగ్ తదితర అంశాలను సమీక్షించారు. మున్సిపాలిటీకి రావాల్సిన పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను చేరుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.


ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ రజిత, జేఏవో అర్షద్, టెక్నికల్ అధికారి రాము, టీపీఎస్ రాజ్‌కుమార్, ఆర్వో గిరిబాబు, సిస్టమ్ మేనేజర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్