సౌల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ సుజాత వాస్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని సౌల తండా గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లో తొలిముద్దు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ సుజాత వాసు తెలిపారు. సోమవారం అంగన్వాడి సెంటర్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, మంచి పోషకాహార అలవాట్లకు పునాది వేయాలనే లక్ష్యంతో సౌల్ల తండ గ్రామంలో తొలిముద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని తెలిపారు.
చిన్నారులకు పోషకాహారం అందించడం, పిల్లల ఎదుగుదలలో తల్లుల పాత్ర, పౌష్టికాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు కవిత పద్మ ఉమారాణి ఆయాలు తల్లులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)