Magazines

కేటీఆర్ గడ్డం కాదు..జుట్టు పెంచుకున్న ఆయన మాటలు ప్రజలు నమ్మరు

11 నిమిషాల క్రితం

vardnnapet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం

- జీవిత బీమా పథకం ఆవిష్కరణ.లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎంపీ కడియం కావ్య 

నవతెలంగాణ వర్ధన్నపేట : గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ప్రజల సంక్షేమాన్ని మరిచి కుటుంబంలో వారి ఆస్తులు వేల కోట్లు దోచుకున్నారని, పగటి వేషాల వారి మాదిరిగా వరంగల్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులు ఘాటుగా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య లు అన్నారు.ఉప్పరపల్లి క్రాస్ వద్ద ఉన్న కళ్యాణి ఫంక్షన్ హాల్‌లో  పర్వతగిరి, వర్ధన్నపేట, మండలాల పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా రూ.5 లక్షల పథకాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు లు  ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  మాట్లాడుతూ కేటీఆర్ గడ్డం పెంచుకోవడంతోపాటు జుట్టు పెంచుకున్నప్పటికీ ప్రజలు ఆయన మాటలు నమ్మరన్నారు  వరంగల్లో కేటీఆర్ వచ్చి డైలాగులు  కొడుతున్నారు కానీ ఇంటి ఆడబిడ్డ కవిత ఎన్నోసార్లు అవినీతిని ప్రశ్నించి చేసిన ఆరోపణలకు  ఒక్క సమాధానం హరీష్ రావు కేటీఆర్ చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పేరున ఇందిరమ్మ ఇళ్ల పట్టాతోపాటు రేషన్ కార్డులు సంఘాల పేరున మండలానికి ఒక బస్సు, పెట్రోల్ బంక్ తోపాటు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పేద మధ్యతరగతి ప్రజలకు వికలాంగులకు వితంతువులకు వివిధ వ్యాధిగ్రస్తులకు సైతం నూతన పెన్షన్ మంజూరు చేస్తున్న అన్నారు 

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పించి పేదలను ఆదుకోవాలని ప్రభుత్వ లక్ష్యమన్నారు  కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోయిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రూ.5 లక్షల బీమా భరోసా కల్పించడం ఈ పథకం ప్రత్యేకత అని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం, పేద కుటుంబాల భద్రతకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా పాలనలో సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ పథకంపై గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం వర్ధన్నపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట 0 పర్వతగిరి మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు జిల్లా స్థాయి అధికారులు, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ శిబారాణి రాజేందర్ , వర్ధన్నపేట పాక్స్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి ,, వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్ ,మండల అధ్యక్షులు పోశాల వెంకన్న గౌడ్, వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడి పేరు ఎద్దు సత్యనారాయణ, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్