కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొహమ్మద్ గౌస్
నవతెలంగాణ-మిడ్జిల్
దేశానికి భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కాంగ్రెస్ మండలాధ్యక్షులు మహమ్మద్ గౌస్ కొనియాడారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మహమ్మద్ గౌస్‌తో పాటు సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు సాయిలు, మల్లికార్జున రెడ్డి, కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంకట శివప్రసాద్‌లు సంయుక్తంగా మాట్లాడుతూ..దేశ సమగ్రత కోసం, పేదరిక నిర్మూలన కోసం ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. ఆమె ఆశయ సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామస్థాయిలో కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ధర్మానాయక్, రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, రాములు, రామ్ గౌడు, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, సోషల్ మీడియా నాయకులు మహమ్మద్ జహీర్, శంకర్ నాయక్, ఉప సర్పంచ్ శ్రీనును నాయక్, ఆదాం, ఉస్మాన్, బాలస్వామి, రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)