కార్తిక దీపం అంటుకుని యువతి మృతి

1 గంట క్రితం

Karthika Deepam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాన - హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కార్తిక దీపం అంటుకుని యువతి మృతిచెందింది. అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న 18 ఏళ్ల సాయి వెంకట సింధు.. బొటిక్ నిర్వహిస్తోంది. ఈ నెల 12న రాత్రి షాప్ నుంచి ఇంటికి వస్తుండగా ఇంటి గేటు వద్ద వెలిగించిన కార్తిక దీపం చీరకు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన సింధును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.  

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్