Tuesday, November 25, 2025
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి...భర్తకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి…భర్తకు తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ మిరుదొడ్డి

నవవధువు మృతి చెంది భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంఘటన సిద్దిపేట జిల్లా మీరు దొడ్డి మండలం పెద్దచెప్పల గ్రామంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆమె భర్త తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే వీరిద్దరికీ వివాహం జరగ్గా.. మృత్యువు వారిద్దరినీ విడదీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారులో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

నవవధువుప్రణతి (24), సాయికుమార్ లు ఉద్యోగం నిమిత్తం సిద్ధిపేట నుంచి టూవీలర్ పై హైదరాబాద్ కు పయనమవ్వగా.. ట్రాక్టర్ అదుపు తప్పి వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అంబులెన్సులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రణతి దారిలోనే మృతి చెందింది. సాయికుమార్ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నవదంపతుల జీవితంలో జరిగిన ఈ విషాద ఘటన.. ఇరు కుటుంబాలతో పాటు గ్రామస్తులచే కంటతడి పెట్టించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -