నవతెలంగాణ-హైదరాబాద్ : చెరువు మీద కొంగ అలిగింది అనే సామెత అందరికి గుర్తుండే ఉంటుంది. అదే చందంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశంలో హాదీ హత్య పరిణామంతో ఒక్కసారిగా రాజకీయ అలజడి చేలరేగిన విషయం తెలిసిందే. అల్లరిమూకల దాడులు మైనార్టీ వర్గాలైన హిందువులపై మిన్నంటాయి. మైనార్టీలపై దాడులు ఆపాలని, వారికి రక్షణ కల్పించాలని యూనిస్ ఖాన్ ప్రభుత్వాన్ని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ దాడులతో భారత్ బంగ్లా మధ్య దౌత్య పరంగా అనిశ్చితి పరిస్థితి నెలకొంది. అదే విధంగా బంగ్లాదేశ్ కు చెందిన క్రికెటర్ ముస్తాఫిజర్ రెహ్మన్ ఐపీఎల్ నుంచి తొలగించాలని కేకేఆర్ యాజమాన్యాన్ని భారత్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. బీసీసీఐ సూచనతో ముస్తాఫిజర్ రెహ్మన్ ను రిలీజ్ చేస్తున్నట్టు కేకే ఆర్ నిర్ణయించింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా వరల్డ్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వేదికగా తమ దేశ క్రికెటర్లు ఆడారని, శ్రీలంకలో తమ మ్యాచ్ లు ఆడుతామని చెప్పింది. తాజాగా భారత్ కు చెందిన ఐపీఎల్ ప్రసారాలను నిలివివేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే నెలలో ప్రారంభకానున్న టీ20 వరల్డ్ కప్ కు శ్రీలంక-ఇండియా సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్నాయి.



