నవతెలంగాణ – హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట్ జిల్లా మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు, అధికారుల సమక్షంలో జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. జెండాను ఎగురవేయడానికి తాడును లాగుతున్న తరుణంలో ఆ బరువుకు జెండా కర్ర మధ్యలోకి విరిగి కిందకు పడిపోయింది. విరిగిపడిన కర్ర మంత్రి వాకిటి శ్రీహరికి అత్యంత సమీపంలో పడింది. ఆయన అప్రమత్తంగా పక్కకు తప్పుకోవడంతో పక్కన ఉన్న మరో వ్యక్తిపై పడి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
విరిగిన జెండా కర్ర..మంత్రికి తప్పిన ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



