- Advertisement -
– ఐఎస్‌ఎఫ్ ప్రపంచకప్
మ్యూనిచ్: ఐఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ సిఫ్త్ కౌర్ సమ్రా కాంస్య పతకం సాధించింది. మహిళల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో 453.1 పాయింట్లతో సమ్రా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. నార్వే షూటర్, మాజీ వరల్డ్ చాంపియన్ జెనెటె 466.9 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా..స్విట్జర్లాండ్ షూటర్ ఎమెలీ 464.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రతజ పతకం సాధించింది. మ్యూనిచ్ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది రెండో మెడల్ కావటం గమనార్హం.
- Advertisement -