– హరీశ్‌రావుతో కేటీఆర్ భేటీ..రెండు గంటలపాటు చర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అంటీముట్టనట్టుగా వ్యవహరించటం, ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాల నేపథ్యంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…శుక్రవారం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్ నివాసానికి వెళ్లిన కేటీఆర్… పలు అంశాలపై దాదాపు రెండు గంటలపాటు ఆయనతో చర్చించారు. ‘కేసీఆర్ తర్వాత కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే సహకరిస్తా.. అధినేత మాటను జవదాటను…’ అంటూ హరీశ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్‌తోనూ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనూ హరీశ్‌కు పొసగటం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతో కేటీఆర్ భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించు కుంది. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్‌రావు తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేం దుకు, పరామర్శించేందుకే కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. వారిరువురూ తాజా రాజకీయ పరిణామాలు, రేవంత్ పరిపాలన, కాంగ్రెస్ హామీల అమలుపై చర్చించారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.
బావగారూ..బాగున్నారా..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES