- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రేపు జరుగనున్న భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీఏ, ఇండియా కూటమి.. రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయంటోన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంభించాలని చూస్తున్నట్టు సమాచారం. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు, ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఇదే సరైన నిర్ణయమని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి సంబంధించి నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే.
- Advertisement -