నవతెలంగాణ-ఆలేరు టౌన్ : ఆలేరు మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, మాజీ రాష్ట్ర ప్రభుత్వ విప్పు, మాజీ శాసన సభ్యురాలు, గొంగిడి సునీత , ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
ఆలేరు పట్టణంలో బుధవారం టిఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. బిఆర్ఎస్ పార్టీ ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల అభ్యర్థుల జాబితాను బొట్ల పరమేష్, వస్పరి శంకరయ్య, కందుల శంకర్, పుట్ట మల్లేష్, గంగుల శ్రీనివాస్, మోగులగాని మల్లేష్ ల సమక్షంలో ఆలేరు మాజీ శాసనసభ్యురాలు బొమ్మిడి సునీత మహేందర్ రెడ్డి విడుదల చేశారు.
1 పాకాల మౌనిక హరీష్, 2 మోతే కనకమ్మ వెంకటేష్, 3 యాట శివ, 4. బీజని కళ్యాణి మధు, 5. మొరిగాడి మాధవి వెంకటేష్, 6. రాయపురం శ్రీనివాస్, 7 బింగి లతా రవి, 8 పాశికంటి శ్రీనివాస్, 9. కందుల బాబు, 10 పోరెడ్డి జయ శ్రీనివాస్, 11 పంతం కృష్ణ, 12. మోర్తాల సునీత రమణారెడ్డి గా ప్రకటించారు.
ఈ సందర్భంగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని వార్డుల అభ్యర్థులను కచ్చితంగా గెలిపించాలని పార్టీ కార్యకర్తలను ఆమె కోరారు.
అభ్యర్థులను సమిష్టి నిర్ణయంతో ప్రకటించామన్నారు. అభ్యర్థుల గెలుపు కొరకు మహిళా విభాగం, యువత ఉద్యమకారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


