Wednesday, May 14, 2025
Homeఖమ్మంధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ : భట్టి

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ : భట్టి

- Advertisement -

నవతెలంగాణ ఎర్రుపాలెం: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఆ వివరాలు లెక్కలతో సహా త్వరలోనే వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రంలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అర్హులకు ఇండ్లు ఇస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లు మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం.. ఇలా ప్రతి ఇంటికి రూ. వేలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేండ్లు పాలించిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గాలికి వదిలేసిందన్నారు. రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. ఆదాయం లేకపోయినా, అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -