- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమ నేతగా రాజకీయ జీవితం ప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఎదిగిన అజిత్ పవార్ మరణం ఆ రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -



