Wednesday, November 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ జాగృతిలో బీఆర్ఎస్ నాయకుల చేరిక

తెలంగాణ జాగృతిలో బీఆర్ఎస్ నాయకుల చేరిక

- Advertisement -

– కండువా కప్పి ఆహ్వానించిన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-కంఠేశ్వర్ : తెలంగాణ జాగృతిలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు చేరారు. బుధవారం నిజామాబాద్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి జాగృతి లోకి ఆహ్వానించారు. ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, నిజామాబాద్ జిల్లా నాయకుడు సూదం రవిచంద్ర, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నరేశ్, ప్రముఖ బీసీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా ఆద్యక్షురాలు విజయ లక్ష్మి, యాదవ సంఘం జిల్లా మహిళ ఆద్యక్షురాలు మంజుల యాదవ్, బోధన్ నియోజకవర్గంలోని నవీపేట మండలం రాంపూర్ మాజీ సర్పంచ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దొంత ప్రవీణ్, మొకన్ పల్లి మాజీ ఎంపీటీసీ జనార్దన్, మహంతం మాజీ సర్పంచ్ రాజేశం, నందిగాం మాజీ ఎంపీటీసీ సంజీవ్, పీఏసీఎస్ డైరెక్టర్ సౌద శ్రీనివాస్, బినోల మాజీ సర్పంచ్ పీతంబర్, నాయకులు సన్నీ, సాయి కుమార్, డాంగే సతీశ్, కుమ్మరి కృష్ణ తదితరులు జాగృతిలో చేరారు. రెంజల్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గౌరాజీ రాఘవేంద్ర యాదవ్, నాయకులు నీల, తెలంగాణ శంకర్, తిరుపతి, రాము చేరారు. బోధన్ నియోజకవర్గానికి చెందిన నాయకులు శంకర్, శేఖర్ రాజ్, జాదవ్ రాజ్, నిజామాబాద్ ఆర్బన్ కు చెందిన శంకర్, విద్యార్థి విబాగం జిల్లా నాయకుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు చేరారు. కార్యక్రమంలో రైతు జాగృతి మంతెన నవీన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఆద్యక్షుడు ఆవంతి కుమార్, మగ్గరి హన్మండ్లు, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -