Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుయూరియా కొర‌త‌పై బీఆర్ఎస్ నేత‌లు నిర‌స‌న‌..అడ్డుకున్న పోలీసులు

యూరియా కొర‌త‌పై బీఆర్ఎస్ నేత‌లు నిర‌స‌న‌..అడ్డుకున్న పోలీసులు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రాష్ట్రంలో నెల‌కొన్ని యూరియా కొర‌త‌పై బీఆర్ఎస్ నేత‌లు పోరుబాటప‌ట్టారు. అసెంబ్లీ స‌మావేశాలు సంద‌ర్భంగా వ్య‌వ‌సాయ క‌మిష‌న‌ర్ కు విన‌తి ప‌త్రం అంద‌జేసేందుకు శనివారం అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషన్ వద్దకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా వెళ్లారు. అగ్రికల్చర్ కమిషనర్‌కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో ముందు ధర్నాకు దిగారు. పదేళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. వర్షంలో తడుస్తూ, అర్ధరాత్రులు ఎరువుల కోసం మహిళా రైతులు రోడ్ల మీద నిలబడి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ నినాదాలు చేశారు.

ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకోని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌తో సహా పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్ ముందు మెరుపు ధర్నాకు దిగారు. హరీశ్‌రావు రన్నింగ్ చేస్తూ సచివాలయం గేటు వద్దకి వచ్చి బైఠాయించి నిరసనలు తెలిపారు. ఇక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad