- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. ఇప్పటికే స్పీకర్‌కు తగినంత సమయం ఇచ్చామని స్పష్టం చేసిన ధర్మాసనం, అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- Advertisement -



