Monday, March 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశాసన మండలిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు సస్పెండ్‌

శాసన మండలిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు సస్పెండ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: శాసన మండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. అక్రమ మైనింగ్‌ అంశంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంపై సభా సంఘం వేయాని.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్‌ చేయాలని నినాదాలు చేశారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఈ అంశంపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో సీఎం రేవంత్‌ స్పష్టం చేశారని చెప్పారు. మరోవైపు మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని పదే పదే కోరారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించడంతో వారిని సస్పెండ్‌ చేయాలని మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈరోజు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను మండలి నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -