Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ విన‌తి ప‌త్రం

ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ విన‌తి ప‌త్రం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సిటీ బస్సులో పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ‘చలో బస్‌ భవన్‌’ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ (BRS) చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, వాణి దేవి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సుధీర్‌ రెడ్డి, ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, లక్ష్మారెడ్డి, పార్టీ నేతలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్‌ భవన్‌ చేరుకున్నారు. అనంతరం టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కేటీఆర్‌, హరీశ్‌, సబిత, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు భేటీ అయ్యారు. గ్రేటర్‌ పరిధిలో పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ తరఫున లేఖ అందజేశారు. ప్రభుత్వ బకాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎన్ని రకాల కుట్రలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటాం. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు, మా పార్టీకి కొత్త కాదు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -