Monday, March 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ ప్ర‌యివేట్ బిల్లు

ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ ప్ర‌యివేట్ బిల్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కేవలం హామీలకే పరిమితం కాకుండా, వాటికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన అధికారిక నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో పాటు అసెంబ్లీ సెక్రెటరీకి కూడా అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తామంటున్న ఆరు గ్యారంటీలకు చట్టపరమైన రక్షణ ఉంటేనే లబ్ధిదారులకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని, ఈ బిల్లు ద్వారా ఆయా పథకాల అమలులో పారదర్శకత , జవాబుదారీతనం పెరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యంత కీలకమైన ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే చర్చకు వచ్చేలా ప్రవేశపెట్టడానికి స్పీకర్ తక్షణమే అనుమతి ఇవ్వాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -