నవతెలంగాణ-తుంగతుర్తి: ఏప్రిల్ నెల చివరి వరకు ఎస్సారెస్పీ నీటిని నిరంతరాయంగా విడుదల చేయాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ బృందం ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ రాస్తారోకో చేశారు.యాసంగి రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలని రైతు భీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.మండలంలో ఎస్సారెస్పీ జలాలు రానట్లయితే వరి పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు.ప్రభుత్వ అధికారులకు తెలియపరిచినప్పటికీ కలెక్టర్ సైతం స్పందించడం లేదని స్థానిక ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాములు గౌడ్,మండల నాయకులు తునికి సాయిలు,గోపగాని రమేష్ గౌడ్,తడకమళ్ళ రవి కుమార్,మండల సర్పంచ్లు మనోజ్,ఎల్లయ్య,మాజీ సర్పంచులు మండల నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.



