- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అంతకుముందు అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే హోం శాఖ ఉనప్పటికీ రాత్రింబవళ్లు కష్టపడే పోలీసులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పోలీసులను ఎంతో గౌరవించారని.. 40, 50వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశారని అన్నారు. అలాగే, కొత్త కమీషనరేట్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులకు ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు.
- Advertisement -



