– హరీశ్‌రావు, కవిత, కేటీఆర్ మధ్య తారాస్థాయికి విభేదాలు
– హరీశ్‌రావు, కవితకు రేవంత్‌రెడ్డి సహకారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ఎల్పీ చీలిక దిశగా ప్రయాణిస్తోంద నీ, ఆయన వైపు 13 మంది, కవితవైపు నలుగురు ఎమ్మెల్యేలున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. రజతోత్సవ సభలో హరీశ్‌రావు, కవిత డమ్మీలుగా మారారని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో కవిత ఒంటరైందన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ విఫలమైందని మాట్లాడటం, పదవులు, ఆస్తులన్నీ కేటీఆర్‌కేనా అని లేఖ రాయడం కవిత వ్యూహాత్మకమే నని చెప్పారు. పార్టీలో కేటీఆర్ తొక్కేస్తున్నాడనీ, కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని సన్నిహితుల వద్ద ఆరోపిస్తోందని అన్నారు. కేసీఆర్ ఒత్తిడితోనే కేటీఆర్‌కు అధ్యక్ష పదవి ఇచ్చినా ఓకే అని హరీశ్‌రావు చెప్పా రన్నారు. అయితే, బీఆర్‌ఎస్‌ఎల్పీ తనకే ఇవ్వాలని హరీశ్‌రావు పట్టుబడు తున్నారని తెలిపారు. కేటీఆర్ తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారాడనే భావనలో హరీశ్‌రావు, కవిత ఉన్నారని చెప్పారు. హరీశ్‌రావు పది మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే సహకరుస్తాననీ, మండలిలో బీఆర్‌ఎస్ నేతగా కవిత ఎంపికకు సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారని బాంబు పేల్చారు. నష్టనివారణ చర్యల్లో భాగంగానే హరీశ్‌రావు ఇంటికి కేటీఆర్ పరిగెత్తాడన్నారు. హరీశ్‌రావును అడ్డం పెట్టుకుని తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం రేవంత్‌రెడ్డి ఉన్నారని విమర్శించారు. కేటీఆర్ ఈ నెల 26 నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారనీ, ఆ సమయంలో బీఆర్‌ఎస్‌లో చీలిక జరుగబోతున్నదని బాంబు పేల్చారు.
చీలిక దిశగా బీఆర్‌ఎస్‌ఎల్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES