Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంగుజ‌రాత్‌లో టెన్త్‌ విద్యార్థి దారుణ హ‌త్య‌..

గుజ‌రాత్‌లో టెన్త్‌ విద్యార్థి దారుణ హ‌త్య‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోగల ఒక ప్రైవేట్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. అదే పాఠశాలలో ఎనిమిదవ చదువుతున్న విద్యార్థి కత్తితో పొడిచి హత్యచేశాడు. ఈ ఘటన ఇటీవల మణినగర్‌ ఈస్ట్‌లోని సెవెంత్‌ డే అడ్వాంటేజ్‌ చర్చి స్కూల్‌లో జరిగింది. విద్యార్థుల మధ్య జరిగిన చిన్న వివాదం వల్ల సీనియర్‌ విద్యార్థిని కత్తితో పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని హత్య చేసిన తర్వత ఆ బాలుడు తన స్నేహితుడుకి చేసిన ఇన్‌స్టా చాట్‌ పోలీసులు బయట పెట్టడంతో.. ఆ పాఠశాల ప్రాంగణంలో నిరసనలకు దారితీసింది. బాధిత కుటుంబంతో పాటు సింధీ వర్గానికి చెందినవారంతా ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించిన నిరసనకారులు పాఠశాల సిబ్బందిపైనా దాడికి దిగారు. సమీపంలో పార్క్‌ చేసిన పాఠశాల బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులతో పాఠశాల ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులు పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పాఠశాల వెలుపల రోడ్డును దిగ్బంధించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad