నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. పదేండ్ల బాలికను హత్య చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతికిరాతంగా బాలికను పొడిచి పొడిచి చంపేశారు. బాధితుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..క్లూస్ టీం తో పాటు డాగ్ స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక ఒంటిపై పలుచోట్ల అతికిరాతంగా కత్తి గాట్లు ఉన్నాయని, కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెప్పారు.
అయితే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రికి కుమార్తెను చనిపోయిన స్థితిలో కనుగొన్నారు. దీంతో ఆ విషయాన్నీ స్థానికులకు తెలిపాడు తండ్రి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపడుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.