- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారమాంట్ కాలనీలో షాకింగ్ ఘటన జరిగింది. మార్వ డెంటల్ హాస్పిటల్ సమీపంలో ఇర్ఫాన్ (24) అనే యువకుడిని బిలాల్ అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఇర్ఫాన్ తమ్ముడు అదనాన్కు, నిందితుడు బిలాల్‌కు మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ గొడవను ఆపేందుకు ఇర్ఫాన్ ప్రయత్నించగా, ఆగ్రహించిన బిలాల్ నేరుగా ఇర్ఫాన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం జరగడం వల్ల ఇర్ఫాన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



