Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్దారుణం..అత్తమామలను కత్తితో నరికి చంపిన అల్లుడు

దారుణం..అత్తమామలను కత్తితో నరికి చంపిన అల్లుడు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో అత్తమామలను అల్లుడు కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 ఏళ్ల క్రితం రామకోటేశ్వరరావు, నాగేశ్వరికి వివాహం జరిగింది. ఏడాది క్రితం నాగేశ్వరి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం అక్కడికి వచ్చిన రామకోటేశ్వరరావు.. మామ బాబూరావు (50), అత్త శారద (45)ను కత్తితో నరికి చంపాడు. భార్యపైనా దాడికి యత్నించాడు. నిందితుడిని నల్లజర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad