నవతెలంగాణ-హైదరాబాద్ :తమ ఫ్లాగ్ షిప్ గోల్డ్ స్టార్ 650 యొక్క మొదటి 500 మంది బయ్యర్ల కోసం పరిమిత సమయం ఆఫర్ తో BSA మోటార్ సైకిల్స్ ఈ నవరాత్రికి పండగ ఉల్లాసం తెచ్చింది. అదృష్టమున్న కస్టమర్లు తమ గోల్డ్ స్టార్ ను ప్రీ-GST 2.0 ధరలకి పొందుతారు, వారు ప్రత్యేకమైన పరిమిత- ఎడిషన్ యాక్ససరీ కిట్ ను కూడా అందుకుంటారు. ఇటీవలి GST సవరణ 350 సిసి కంటే ఎక్కువగా ఉన్న మోటార్ సైకిళ్లపై సుంకాలను 28 శాతం నుండి 40 శాతంకి పెంచింది కానీ BSA కస్టమర్ల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగిస్తోంది మరియు మోటార్ సైకిళ్ల పట్ల ఆరాధన ఉన్న వారికి ఆకర్షణీయమైన విలువకి విలక్షణమైన రైడింగ్ అనుభవం ఇవ్వడానికి ధరల ప్రభావాన్ని తగ్గిస్తోంది.
మోటార్ సైక్లింగ్ పట్ల ఆసక్తి ఉన్న వారు BSA వారి గోల్డ్ స్టార్ యొక్క ప్రముక 650 సిసి సింగిల్-సిలిండర్ పెర్ఫార్న్స్ మరియు ప్రామాణికమైన బ్రిటీషు ఇంజనీరింగ్ ను భారతదేశంలోని 400కి పైగా డీలర్ షిప్స్ లో అనుభవాన్ని కొనసాగించవచ్చు. వాటి విశిష్టమైన డిజైన్ మరియు ప్రీమియం క్లాసిక్స్ లో ఇంజనీరింగ్ శ్రేష్టతకు అభిమానించబడిన గోల్డ్ స్టార్ ఇప్పుడు మొట్టమొదటిగా రూపొందించబడిన రూ. 5,900 విలువ గల పరిమిత-ఎడిషన్ ‘గోల్డెన్ కిట్ ‘తో లభిస్తోంది. పొడవైన టూరింగ్ విండ్ స్క్రీన్, పిలియన్ బ్యాక్ రెస్ట్, మెటల్ ఎగ్జ్ హాస్ట్ షీల్డ్ మరియు వెనక ఉండే రైల్ ఫీచర్లు స్టైల్ మరియు లక్ష్యం రెండిటినీ చేరుస్తోంది.
శరద్ అగర్వాల్, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, క్లాసిక్ లిజెండ్స్, ఇలా అన్నారు, “భారతదేశంలో ప్రారంభమైన నాటి నుండి ఈ BSA గోల్డ్ స్టార్ నమ్మకమైన ఫాలియింగ్ ను కలిగి ఉంది, మోటార్ సైక్లింగ్ ను రవాణా విధానంగా కాకుండా జీవనశైలిగా పునర్నిర్వచించింది. మా మొదటి 500 మంది కొనుగోలుదారులకు GST 2.0 తదుపరి మా ధరల్ని స్థిరంగా ఉంచడం ద్వారా మరియు దానిని మా పండగ చొరవతో జత చేయడం ద్వారా, రాజీ లేకుండా ఈ జీవనశైలిని స్వీకరించడానికి మేము మరింత మంది ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నాము.“
22 సెప్టెంబర్ 2025న జరిగిన GST 2.0 సంస్కరణలను అనుసరించి తమ ధరల్ని ఇతర ప్రీమియం బ్రాండ్స్ సర్దుబాటు చేసుకోగా, BSA కస్టమర్ సంతృప్తికి కట్టుబడింది. పండగ సీజన్ పూర్తి స్థాయిలో ఉండటంతో, దేశవ్యాప్తంగా ఉన్న అథీకృత BSA డీలర్ షిప్స్ తక్షణ డెలివరీల కోసం సిద్ధంగా ఉన్నాయి.
మోటార్ సైకిల్ ఔత్సాహికులు తమ గోల్డ్ స్టార్ ను రూ. 3,09 లక్షలకు బుక్ చేయవచ్చు మరియు 5.99 శాతంకి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు, జీరో డౌన్ పేమెంట్, ఆరు సంవత్సరాల వరకు లోన్ అవధి సహా ఉత్తేజభరితమైన ఫైనాన్స్ ఆఫర్లు పొందవచ్చు. ఈ సెలబ్రిటీ ఆఫర్ కేవలం BSA మోటార్ సైకిల్స్ పోషకులకు ధన్యవాదాలు తెలపడానికి ఒక మార్గం మాత్రమే కాదు ఇది బహిరంగ రహదారిని తప్పించుకునే మార్గంగా కాకుండా సొంతం చేసుకునే మార్గంగా భావించే మోటార్ సైక్లింగ్ ప్యూరిస్ట్స్ పై బ్రాండ్ కు గల అంకితభావాన్ని కూడా శక్తివంతం చేస్తోంది.
BSA వారి డిజైన్ వారసత్వం: ద గోల్డ్ స్టార్ BSA వారి లోపాలు లేని బ్రిటీషు వారసత్వాన్ని తెచ్చింది, దిగ్గజపు బ్యాడ్జీతో రౌండ్ గా ఉన్న ఇంధనం ట్యాంక్, పాలిష్ చేయబడిన మెటల్ టచెస్, పిన్ స్ట్రిపింగ్, మరియు క్రోమ్ పైప్స్ కావలసిన సందర్భానికి అనుగుణంగా తయారు చేయబడ్డాయి. LED లైటింగ్, వైర్-స్పోక్ వీల్స్ మరియు క్రిస్ప్ స్విచ్ గేర్ వంటి ఆధునిక వివరాలు తమ క్లాసిక్ కేఫ్ రేసర్ సిల్హౌటీలో సహజంగా అమరాయి. తీర్చిదిద్దబడిన లైన్స్, పొడవైన భంగిమ, లోతైన ఆకృతి గల సీటుతో దీని రూపం వలే శాశ్వతమైన భావన కలిగిస్తాయి.
సామర్థ్యం & ఇంజనీరింగ్: దీని ప్రధానమైన విషయంలో 45hp మరియు 55nm టార్క్ ని అందచేసే 652 సిసి, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ – DOHC ఇంజన్ భాగంగా ఉన్నాయి. ఇది తన శ్రేణిలో అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత మెరుగుపరచబడిన వాటిలో ఒకటి. ఇది నగర ట్రాఫిక్ లో అయినా లేదా బహిరంగ జాతీయ రహదారుల పైన సాఫీ పవర్ కోసం తయారు చేయబడింది. 5-స్పీడ్ గేర్ బాక్స్ , అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్, డ్యూయల్-ఛానల్ ABS, మరియు టెలీఫోనిక్ ఫోర్క్స్ తో డబల్-క్రేడిల్ ఛాసిస్ లు సులభంగా రైడింగ్ చేయడానికి, ఆత్మవిశ్వాసం కోసం తయారు చేయబడ్డాయి. వెడల్పు టైర్లు, ప్రీమియం డిస్క్ బ్రేక్స్, మరియు ఉత్తమంగా సమతుల్యం చేయబడిన సస్పెన్షన్ లు ప్యాకేజీని పూర్తి చేస్తాయి, స్థిరత్వం, నియంత్రణ మరియు దూర ప్రాంతాల రవాణా సౌకర్యం అందిస్తాయి.
ఈ పండగ సీజన్ లో, గోల్డ్ స్టార్ కథలో భాగంగా మారండి. వారసత్వంపై రూపొందించబడిన మోటార్ సైకిల్, ఈ రోజు కోసం రూపొందించబడింది, అందరిలో ప్రత్యేకంగా కనిపించడానికి నిర్మించబడింది.
మనశ్సాంతికి హామీ
· BSA గోల్డ్ స్టార్ ఇటీవల పరిచయం చేయబడిన ‘జావా యెజ్డీ BSA యాజమాన్య హామీ కార్యక్రమం’తో మద్దతు చేయబడింది – ఈ శ్రేణిలో పరిశ్రమలోనే మొదటి కార్యక్రమం.
· ఈ సమగ్రమైన కార్యక్రమంలో 4 సంవత్సరాల/50,000 కిమీ స్టాండర్డ్ వారంటీ, ఆరు సంవత్సరాల వరకు దీర్ఘకాల కవరేజ్ ఎంపికలు, ఒక సంవత్సరం రోడ్ సైడ్ సహాయం, మరియు సాహసోపేతమైన ఇంజనీరింగ్ శ్రేష్టత మరియు దీర్ఘకాలం విశ్వశనీయతలో జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ యొక్క ఆత్మవిశ్వాసాన్ని సూచించే యాజమాన్యం ప్రయోజనాల శ్రేణి భాగంగా ఉన్నాయి.
· కంపెనీ తమ సేల్స్ మరియు సర్వీస్ నెట్ వర్క్ సులభంగా అందుబాటులో ఉండటానికి మరియు నిర్వహణ కోసం 400+ టచ్ పాయింట్లకు విస్తరించింది.