- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ నెట్‌వర్క్‌ను రాబోయే 6 నుంచి 8 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘కౌటిల్య ఎకనామిక్ సదస్సు 2025’లో వెల్లడించారు. ఈ మార్పుతో బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -