నవతెలంగాణ-ఆర్మూర్: పట్టణంలోని 15, 16,35వ వార్డ్ లింక్ రోడ్డు బీటి రోడ్ పనులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం మూడు వార్డులకు లింక్ రోడ్డులను మంజూరు చేశారు.. టియుఫైడిసి నిధుల్లో భాగంగా ఈ పనులు ప్రారంభించినట్టు బీజేపీ మండల అధ్యక్షులు మందుల బాలు సోమవారం తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం కు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. రామ్ నగర్ లోని రామాలయం నుండి రాజీవ్ గాంధీ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం నుండి జిరాత్ నగర్ వరకు పిప్రి రోడ్ లింక్ చేస్తూ బీటీ రోడ్ పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోల్కం వేణు సీనియర్ నాయకులు ఆకుల శీను, సుంకే రంగన్న ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, కుక్కునూరు లింగన్న, దొండి ప్రకాష్, మనీ తదితరులు పాల్గొన్నారు.
పలు వార్డులలో బీటీ రోడ్డు పనుల ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



