నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పడంపల్లి గ్రామంలో బాల, బాలికల ఆధ్వర్యంలో బుద్ది గణపతిని ఘనంగా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల, బాలికలు వారి తల్లిదండ్రులు గ్రామస్తులు పెద్దలు ఘనంగా గణపతి ప్రతిష్టాపన వేడుకలలో పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతిఏటా ప్రత్యేకంగా బుద్ది గణపతి ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ గణపతిని ఐదు రోజులపాటు ప్రతిష్టాపన చేసి నియమ నిష్టలతో నిత్యము ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. నిర్వాహకులు బాలలు కావడంతో నేటి బాలురే రేపటి పౌరులు అని వారికి మంచి బుద్ధి విద్య ప్రసాదించాలని గణపతిని వేడుకుంటూ గత సంవత్సరం నుండి పూజలు నిర్వహిస్తు వస్తున్నారు. అదేవిధంగా చివరి రోజైన ఐదవ రోజు మహా అన్నదానం చేసి పేదలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అందులో గ్రామస్తులు అందరూ పాల్గొంటారని అన్నారని ఈ బుద్ది గణపతి ప్రతిష్టాపన కార్యక్రమంలో స్వామీజీ శంకరప్పా, వైద్యనాథ్ అప్పా, విగ్రహ దాత పావుడే గంగాధర్ సరస్వతి, గ్రామస్తులు బిరాధార్ హన్మంత్, ఆకాశే శ్రీధర్ , కత్తి వారి రాజు, శ్రీకాంత్ , సాయి, బీరుగొండ , పావుడే ఓంకార్, నాగనాథ్, నిహారిక పావడే, నాధుడే సవిత, పావుడే భాగ్యశ్రీ, , నాధుడే సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
పడంపల్లిలో ఘనంగా బుద్ది గణపతి ప్రతిష్టాపన వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES