Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిర్లక్ష్యం వల్లే కరెంట్ షాక్ తో గేదె మృతి 

నిర్లక్ష్యం వల్లే కరెంట్ షాక్ తో గేదె మృతి 

- Advertisement -

 నవతెలంగాణ – భీంగల్ : భీంగల్ మండలంలోని కుప్కాల్ గ్రామ శివారులో కరెంట్ షాక్‌తో గేదె మృతి చెందినట్లు శనివారం గ్రామస్తులు తెలిపారు. కుప్కాల్ గ్రామానికి చెందిన పెట్ల బాలలింగం తన గేదెను మేపేందుకు పొలాలకు వెళ్లే మట్టి రోడ్డు మార్గంలో తోలుకపోగా ట్రాన్స్ఫార్మర్ ఎత్తు తక్కువగా ఉండటంతో  కరెంటు తీగలు తగిలి గేదె అక్కడికక్కడే మృతి చెందిందని గేదె యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ట్రాన్స్ఫార్మర్ కు నిర్మించిన గద్దె ఎత్తు తక్కువగా ఉండటం వల్లనే కరెంటు షాక్ తగిలినట్లు గ్రామస్తులు చెప్పారు. అంతేకాకుండా గద్దె ఎత్తు తక్కువగా ఉండటం వల్ల అటువైపుగా వెళ్లే రైతులకు ఇబ్బందికరంగా, భయంకరంగా ఉందని రైతులు గ్రామస్తులు అన్నారు. ఇది ఎవరి తప్పిదమో విద్యుత్ శాఖ చెప్పాలని గేదే యజమాని కోరడం జరిగింది. గేదె సుమారు 80 వేయిల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. నష్టపోయిన పేద రైతుకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -