Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంకుప్పకూలిన భవనం..ముగ్గురు దుర్మరణం

కుప్పకూలిన భవనం..ముగ్గురు దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ లోని దర్యాగంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందిన వెంటనే ఢిల్లీ స్థానిక అధికారులు, ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో మరణించిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా ఘటనా స్థలంలో భవన శిథిలాల తొలగింపు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఘటనకు కారణాలపై నిర్ధారణకు వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -