- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఆదివారం రాత్రి బుల్లెట్ల వర్షం కురిసింది. గయా ప్రావిన్స్‌లోని శాంటా లుసియాలోని ఓ నైట్ క్లబ్ వద్ద దుండగులు తుపాకులతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారంతా 20 నుంచి 40 ఏండ్ల లోపు వయసు వారేనని పోలీసులు తెలిపారు.
- Advertisement -