Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరైల్వే ప్ర‌యాణీకుల‌కు బంప‌రాఫ‌ర్

రైల్వే ప్ర‌యాణీకుల‌కు బంప‌రాఫ‌ర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పండగ సమయాల్లో రద్దీని తగ్గించడానికి ‘రౌండ్‌ ట్రిప్‌ ప్యాకేజి’ పేరుతో భారతీయ రైల్వే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తిరుగు ప్రయాణ టికెట్‌ పై 20 శాతం తగ్గింపు ఇవ్వనున్నారు. రెండు వైపులా ప్రయాణికుల సంఖ్యను పెంచడం కోసం టికెట్‌ పై డిస్కౌంట్‌ కల్పిస్తోంది. ఊరెళ్లే ప్రయాణికులు తిరుగు ప్రయాణంలోనూ రైలెక్కితే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.

ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం అమల్లోకి వస్తుందని ఇండియన్ రైల్వే తెలిపింది. రాయితీ ఛార్జీలపై ఎలాంటి రైల్వే కూపన్లు, వోచర్ ఆధారిత బుకింగ్, పాస్ లు అనుమతించబడవని వెల్లడించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img