– ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 387/10
– జో రూట్ శతకం, స్మిత్ అర్థ సెంచరీ
– భారత్, ఇంగ్లాండ్ లార్డ్స్ టెస్టు రెండో రోజు
నవతెలంగాణ-లండన్
లార్డ్స్‌లో జశ్‌ప్రీత్ బుమ్రా ఐదేశాడు. జో రూట్ (104), హ్యారీ బ్రూక్ (11), బెన్ స్టోక్స్ (44), జోఫ్రా ఆర్చర్ (4), క్రిస్ వోక్స్ (0) వికెట్లను పడగొట్టిన బుమ్రా.. చారిత్రక లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. పేస్ దళపతి ఐదు వికెట్ల విజృంభణకు మహ్మద్ సిరాజ్ (2/85), నితీశ్ కుమార్ రెడ్డి (2/62) జతకలిసినా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ జో రూట్ (104, 199 బంతుల్లో 10 ఫోర్లు) కెరీర్ 37వ సెంచరీతో కదం తొక్కగా.. జెమీ స్మిత్ (51, 56 బంతుల్లో 6 ఫోర్లు), బ్రైడన్ కార్స్ (56, 83 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో పది వికెట్లకు 387 పరుగులు చేసింది.
రూట్ సెంచరీ
ఓవర్‌నైట్ స్కోరు 99తో బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్.. బుమ్రాపై తొలి బంతినే బౌండరీకి తరలించి కెరీర్ 37వ సెంచరీ సాధించాడు. 192 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ సాధించిన రూట్.. లార్డ్స్‌లో ఎంతో సహనంతో కూడిన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. క్రీజులో నిలదొక్కుకున్న బెన్ స్టోక్స్ (44), రూట్ సహా క్రిస్ వోక్స్ (0)లను సాగనంపిన బుమ్రా.. 271/7తో ఇంగ్లాండ్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం చేసేలా కనిపించాడు. కానీ జెమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) ఎనిమిదో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. స్మిత్ 52 బంతుల్లో ధనాధన్ ఫిఫ్టీ బాదగా.. కార్స్ 77 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగుల భారీ స్కోరు చేసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆశావహ ప్రదర్శన చేస్తోంది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (34 బ్యాటింగ్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (11 బ్యాటింగ్) అజేయంగా ఆడుతుండగా.. మూడో సెషన్లో డ్రింక్స్ విరామ సమయానికి భారత్ 28 ఓవర్లలో 2 వికెట్లకు 98 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) ఆరంభంలోనే జోఫ్రా ఆర్చర్ బంతికి వికెట్ కోల్పోయాడు. కరుణ్ నాయర్ (40, 62 బంతుల్లో 4 ఫోర్లు) ఆకట్టుకునే ఆరంభం అందుకున్నా.. స్టోక్స్ వలలో చిక్కాడు.
బుమ్రా మెరిసినా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES