నవతెలంగాణ-హైదరాబాద్ : వరల్డ్ టెస్టు ఛాంపియన్స్‌గా భారత్‌లో అడుగు పెట్టిన సౌతాఫ్రికాకు తొలి టెస్టు తొలి రోజు ఆటలో చుక్కలు కనిపించాయి. భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో సఫారీ బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నాంరా బాబు అనేలా చేశాడు. 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా దెబ్బకు సౌతాఫ్రికా తొలి రోజే కుప్పకూలింది. ఈడెన్ గార్డెన్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టులో సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. మార్క్‌రమ్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రికెల్టన్ (23), ముల్దర్ (24), డి జొర్జి (24) మినహా మిగిలిన ప్లేయర్లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో బుమ్రాకు 5 వికెట్లు లభించగా.. సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ లభించింది.
చెలరేగిన బుమ్రా..సౌతాఫ్రికా ఆలౌట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



