Monday, November 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబస్సు ప్రమాదం..అనాథలుగా మారిన చిన్నారులు

బస్సు ప్రమాదం..అనాథలుగా మారిన చిన్నారులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-చేవెళ్ల : చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో వికారాబాద్‌ జిల్లా యాలాల్‌ మండలం హాజీపూర్‌కు చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ మృతి చెందారు. వారి పిల్లలు భవానీ, శివలీల ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనస్థలిలో నిర్జీవంగా పడివున్న తమ తల్లిదండ్రులను చూసుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది దుర్మరణం చెందారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -