Friday, November 28, 2025
E-PAPER
Homeక్రైమ్పాతరేణిగుంటలో బస్సు ప్రమాదం

పాతరేణిగుంటలో బస్సు ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ తిరుపతి: కర్నూల్ జిల్లాలో బస్సు ప్రమాదం మొదలు.. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఏదోక ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా పాతరేణిగుంట సమీపంలో ఎంప్లాయిస్ ను తీసుకువెళ్తున్న అమరరాజా కంపెనీ బస్సు కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జవ్వగా.. ఈ రెండింటి పక్క నుంచి వెళ్తున్న టీవీఎస్ వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు విరిగినట్టు సమాచారం. నగరి నుంచి కరకంబాడి సమీపంలో ఉన్న అమరరాజా ఫ్యాక్టరీ ఉద్యోగులను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుంది. ప్రమాదంలో ఎవరైనా మరణించారా? కారులో ఉన్నవారి పరిస్థితి ఏంటి ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -