- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ రహదారిపై కారును బస్సు ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్‌కు చెందిన సాయితేజ, పవన్, రాఘవేంద్రగా గుర్తించారు. మంగళవారం ఏడుగురు స్నేహితులు నాగార్జునసాగర్ పరిధిలోని వైజాగ్ కాలనీకి విహారానికి వెళ్లారు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో మాల్ వద్ద వీరి కారును బస్సు ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -